మేలుకో మనిషి మేలుకో
తింటేనే కడుపు నిండ తిండి
సాగుతుంది మన బ్రతుకు బండి
ఆకలేస్తే తింటావు కడుపుకు అన్నం
కాదని తింటావా నీ భవంతులకున్న సున్నం
కోట్లరూపాయలు ఉండి ఎందుకు దండగ
కొంచం అన్నం ఉంటే చాలు కడుపు నిండుగా
ఎవరైన తినేది ఉప్పు కారం
ఇక ఎందుకు ఆ అహంకారం
మరిచారా ఏంటి పరోపకారం
బ్రతికేమందం ఉంటే చాలదా నీకు డబ్బు
అత్యాశే కదా ఒక భయంకరమైన జబ్బు
ముందుకు సాగాలంటే నీ జీవనరథం
ఇక మరచిపో నువ్వు ఆ మతం
దాహమేస్తే త్రాగేది నీవు జలం
ఇక ఎందుకయ్య నీకు ఆ కులం
ఐకమత్యమే కదా మహాభలం
సక్రమంగా పాటిస్తే చాలుదా నీతి
ఇక నీకెందుకు ఆ బంధుప్రీతి
చెడ్డవాడికి తప్పదు శిక్ష
మంచి గుణమే కదా శ్రీరామరక్ష
'మనీ' ఉన్నవాడు కాదు మనిషి,
మంచి మనసున్న వాడే మనిషి(మహర్షి).
ఆ కుంభకర్న నిద్ర నుండి మేలుకో
ఇకనైన మనిషి విలువ తెలుసుకో !.
Comments
Post a Comment