చెట్లే మన మిత్రులు చెట్లు అంటే ఏమిటి? మధ్యలో మాను, పక్కకు కొమ్మలు, సరైన ఎత్తు, ఉన్న వాటిని చెట్లు అంటారు. చెట్లు గుంపుగా ఉన్న ప్రదేశాన్ని అడవి అని అంటారు. చెట్లు చాలా గొప్పవి. చెట్లు కొన్ని వందల సంవత్సరాలు కూడా జీవించగలవు. కాలానుసారంగా చెట్లు తమ ఆకృతిని మార్చుకుంటూ ఉంటాయి. చెట్లకు పురాణాలలో కూడా చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. మన భారతీయులు చెట్లని దేవుళ్ళలా భావించి పూజిస్తారు.చెట్లని నరకడం మహా పాపంలా భావిస్తారు. చెట్ల గొప్పతనం ఏమిటి? "పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు" అని అంటారు. మనం చెట్ల మీద చాలా ఆధారపడి ఉన్నాము. చెట్లు లేకపోతె మనం బ్రతకలేము. చెట్లు మనకు ప్రాణవాయువైన ఆక్సిజన్ని ఇస్తాయి. చెట్ల వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. చెట్లు వర్షాలు పడడానికి సహాయం చేస్తాయి. చెట్లనుండి చాలా మందులు తయారవుతాయి. ఎన్నో రోగాలకు ఔషాదాలు చెట్ల నుండే తయారవుతాయి. చెట్ల నుండి వచ్చే కట్టలతోనే మనకు మంట వస్తుంది. చెట్లు లేకపోతే మనుగడ లేదు. చెట్లు లేకపోతే అస్సలు జీవమే లేదు. మనిషి ప్రాణానికి చెట్టుకి సంబంధం ఏమిటి? చెట్లు మానవజాతికి మంచి మిత్రులు. చెట్ల నుండి మనిషి ఎంతో లబ్ది పొందుతున్నాడు....
దేశ భాషలందు తెలుగు లెస్స !. తెలుగు మన జీవన వెలుగు! తెలుగు బాషా గొప్పతనం తెలుసుకుందాం ! తెలుగు భాషను కాపాడుకుంటాం .
Comments
Post a Comment