చెట్లే మన మిత్రులు
చెట్లు అంటే ఏమిటి?
మధ్యలో మాను, పక్కకు కొమ్మలు, సరైన ఎత్తు, ఉన్న వాటిని చెట్లు అంటారు. చెట్లు గుంపుగా ఉన్న ప్రదేశాన్ని అడవి అని అంటారు. చెట్లు చాలా గొప్పవి. చెట్లు కొన్ని వందల సంవత్సరాలు కూడా జీవించగలవు. కాలానుసారంగా చెట్లు తమ ఆకృతిని మార్చుకుంటూ ఉంటాయి. చెట్లకు పురాణాలలో కూడా చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. మన భారతీయులు చెట్లని దేవుళ్ళలా భావించి పూజిస్తారు.చెట్లని నరకడం మహా పాపంలా భావిస్తారు.
చెట్ల గొప్పతనం ఏమిటి?
"పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు" అని అంటారు. మనం చెట్ల మీద చాలా ఆధారపడి ఉన్నాము. చెట్లు లేకపోతె మనం బ్రతకలేము. చెట్లు మనకు ప్రాణవాయువైన ఆక్సిజన్ని ఇస్తాయి. చెట్ల వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. చెట్లు వర్షాలు పడడానికి సహాయం చేస్తాయి. చెట్లనుండి చాలా మందులు తయారవుతాయి. ఎన్నో రోగాలకు ఔషాదాలు చెట్ల నుండే తయారవుతాయి. చెట్ల నుండి వచ్చే కట్టలతోనే మనకు మంట వస్తుంది. చెట్లు లేకపోతే మనుగడ లేదు. చెట్లు లేకపోతే అస్సలు జీవమే లేదు.
మనిషి ప్రాణానికి చెట్టుకి సంబంధం ఏమిటి?
చెట్లు మానవజాతికి మంచి మిత్రులు. చెట్ల నుండి మనిషి ఎంతో లబ్ది పొందుతున్నాడు. మనిషి బ్రతకాలంటే ప్రాణవాయువు కావలి. ఆ ప్రాణవాయువుని మనకు చెట్లే ఇస్తాయి. ప్రాణవాయువు లేకపోతే మనిషి బ్రతకలేడు, ప్రాణవాయువు కావాలంటే చెట్లు కావలి. అందుకే చెట్లు లేకపోతే మనిషే లేడు.తినడానికి తిండి కూడా చెట్లే ఇస్తున్నాయి. అలాగే ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు కూడా చెట్లే ఇస్తున్నాయి. మనిషి బ్రతికున్నప్పుడే కాదు చచ్చాక కాలేయాలన్న చెట్టు నుండి వచ్చే కర్రలు కావలి.
చెట్ల వలన లాభాలు.
చెట్ల నుండి మనకు చాలా లాభాలు ఉన్నాయి.
- చెట్ల నుండి పండ్లు పూలు లభిస్తాయి.
- చెట్లు మనకి నీడను ఇస్తాయి.
- చెట్ల నుండి ఎన్నో ఔషదాలు లభిస్తాయి.
- చెట్ల నుండి మనకి ప్రాణవాయువు లభిస్తుంది.
- చెట్లు వర్షాలు పడడానికి సహకరిస్తాయి.
- చెట్లు అనేక పశుపక్షాదులకి నీడనిస్తాయి.
- చెట్ల నుండి ఎన్నో వస్తువులు తయారవుతాయి.
చెట్లు లేకపోతే నష్టాలు:
- చెట్లు లేకపోతే చాలా నష్టాలు ఉన్నాయి.
- చెట్లు లేకపోతే ప్రాణవాయువు లేదు.
- చెట్లు లేకపోతే వర్షాలు పడవు.
- నీటి కొరత ఏర్పడుతుంది.
- వాతావరణంలో కాలుష్యం ఎక్కువవుతుంది.
- చెట్లు లేకపోతే ఇంటికి కావలసిన వస్తువులు తయారవ్వవూ.
చెట్లను ఎందుకు కాపాడాలి.
మనం పూర్తిగా చెట్ల మీదే ఆధారపడి ఉన్నాము. మనం మన అవసరాల కొరకు చెట్లను నరుక్కుంటూ పోతున్నాము. అలా చెయ్యడం వలన భవిష్యత్ తరాల వారు చాలా ఇబ్బంది పడవలసిన అవసరం ఉంది.మనమే ప్రాణవాయువుని కొనుక్కుంటున్నాం. మన భవిషత్ తరాలవారు ప్రాణవాయువు కోసం యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వర్షాలు లేక పంటలు పండక ఎందరో ఆకలి చవులు చావలసిన పరిస్థితి వస్తుంది.
చెట్లను ఎలా కాపాడుకోవాలి:
"వృక్షో రక్షతి రక్షితః" అంటే నువ్వు చెట్టుని కాపాడితే ఆ చెట్టు నిన్ను కాపాడుతుంది అని అర్థం. చెట్లను చాలా నాటాలి. చెట్లను కొట్టివేయకూడదు. చెట్ల వలన లాభాలేంటో అవి లేకపోతే కలిగే నష్టాలేంటో ప్రజలకి చెప్పి వారిలో అవగాహన తీసుకు రావాలి. నిర్సరీల ద్వారా ఉచితంగా మొక్కలు పంపిణి చేయాలి. కాళీ ప్రదేశాలలో మొక్కలు నాటాలి. చెట్లను కాపాడడానికి ప్రభుత్వం కూడా కృషి చేయాలి.
Comments
Post a Comment