student / విద్యార్ధి అంటే ఎవరు ?
విద్యను అభ్యసించు వారిని, లేదా విద్యను అర్థించు వారిని విద్యార్థులు అంటారు .నేటి విద్యార్థులే రేపటి పౌరులు అంటారు. వారు నేర్చుకున్న విద్యను వారు సక్రమంగా వినియోగించుకొని భవిష్యత్తులో మన దేశాన్ని ముందుకి నడుపుతారు. దేశాభివృద్ధికి పాల్పడుతారు . మనిషి జీవితంలో విద్యార్ధి దశ చాలా కీలకమైనది. ఆ దశలోనే మన సమాజం గురించి దేశం గురించి అవగాహనా తెచ్చుకుంటారు .
విద్యార్ధి - క్రమశిక్షణ .
మంచి విద్యార్థులకి క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం . క్రమశిక్షణ చూసే ఆ విద్యార్ధి / వక్తి ఎలాంటివాడో చెప్పగలము. కనుక విద్యార్థికి క్రమశిక్షణ అనేది ముఖ్యం .
క్రమశిక్షణ అనేది రెండు రకాలుగా ఉంటుంది .
- ఆంతరంగిక క్రమశిక్షణ .
ఆంతరంగిక క్రమశిక్షణ అంటే తనను తాను ప్రేరేపించుకోవడం. మంచిచేతులని తెలుసుకొని సక్రమమైన దారిలో నడవడం.
- బాహ్య క్రమశిక్షణ .
బాహ్య క్రమశిక్షణ అంటే ఇతరుల ద్వారా ప్రేరేపితులై వారు చెప్పినట్టు నడుచుకోవడం .
క్రమశిక్షణ లోపించడం .
నేటి విద్యార్థులలో క్రమశిక్షణ లోపించడం అంతేది జరుగుతుంది. సినిమాలకు, రాజకీయాలకు, ఫోనులో ఆడే ఆటలకు, టీవీకి, చేడు వ్యసనాలకు, ఆకర్షితులై వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు.
క్రమశిక్షణ లోపంలో తల్లిదండ్రుల పాత్ర :
తల్లిదండ్రులు తమ పిల్లలని పట్టించుకోకుండా వదిలేయడం. సమాజం గురించి దేశం గురించి మంచి చెడులు చెప్పి వారిలో నైతిక విలువలు పెంచే ప్రయత్నం చేయకుండా, డబ్బు, ఆస్తి సంపాదించడం లో లీనమైపోవడం. వారి పిల్లలు ఏమి చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అని తెలుసుకోకుండా ఉండడం .
క్రమశిక్షణ లోపంలో స్నేహితుల పాత్ర .
విద్యార్థులు స్నేహితులని ఎన్నుకోవడంలో విఫలమవడం.స్నేహితుల ప్రేరణతో చెడుని అలవాటుచేసుకుని జూదానికి, వ్యసనాలకు బానిసలవుతున్నారు. చెడుకి ప్రభావితులై చెడ్డవారితో స్నేహం చేసి వారి బంగారు భవిషత్తుని పాడుచేసుకుంటున్నారు .
క్రమశిక్షణ లోపంలో రాజకీయం పాత్ర .
విద్యార్థుల రాజకీయాలకు ప్రభావితులై, వారి చదువుని పక్కకు పెట్టి రాజకీయనాయకులతో కలవడం, వారు చేసే చెడులో, అవినీతిలో బాగామవడం. రాజకీయ అల్లర్లకు, గొడవలకు బలవడం.
క్రమశిక్షణ లోపంలో సామాజిక మాధ్యమాల పాత్ర (సోషల్ మీడియా ).
విద్యార్థులు సోషల్ మీడియాని చెడుకు వాడడం . సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ప్రజలను మోసం చేయడం . టీవీ , ఫోన్ , లాప్టాప్ , వంటి వాటికి అలవాటైపోవడం .
క్రమశిక్షణ పెంపొందించుకోవడం ఎలా ?
- గొప్ప నాయకులని స్ఫూర్తిగా తీసుకోవడం .
- రాజకీయాలకు దూరంగా ఉండడం .
- దేశభక్తి పెంపొందించుకోవడం .
- పెద్దలను, తల్లిదండ్రలని, గురువులని గౌరవింటడం
- సమాజం పట్ల మంచి భావన కలిగి ఉండడం
- సామజిక మాధ్యమాన్ని మంచికి వాడడం
క్రమశిక్షణ వల్ల ఉపయోగాలు .
- నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి .
- నైతిక విలువలు దేశభక్తి పెరుగుతుంది .
- సమయానుకూలంగ పనులు పూర్తవుతాయి .
- సమాజంలో గౌరవం దొరుకుతుంది .
విద్యార్థులకి క్రమశిక్షణ తరువాతే ఏదైనా . క్రమశిక్షణ మనిషిని ఉన్నతునిగా చేస్తుంది , మనిషికి క్రమశిక్షణ ఎంతో అవసరం. కాబట్టి విద్యార్థి దశలోనే క్రమశిక్షణ పెంపొందించుకోండి .
Comments
Post a Comment