Importance of mother tongue మాతృభాష ప్రాముఖ్యత భాష గొప్పతనం! ఈ భూమండలం మీద ఏ జీవికి లేని ఒక అద్భుతమైన శక్తీ మనిషికి ఉంది. అదే మాట్లాడే శక్తీ. మనం ఎవరితోఅయన మాట్లాడాలంటే ఏదైనా ఒక భాష తెలిసిఉండాలి. ఒక భాషతో మనలోని భావాలను ఇతరులకి తెలియజేయచ్చు. భాష వలన ఒకరి భావాలను ఒకరికి తెలియజేయవచ్చు. బాష మనిషిని ఒక ఉన్నతుడిగా నిలబెట్టింది. భాష లేకపోతే మనిషి మనుగడ కష్టమయ్యేది. భారతదేశంలో అస్సామీ, బెంగాలీ, బోడో, డోగ్రి, గుజరాతీ, హింద్, కన్నడ, కాశ్మీరీ, కొంకని, మైథిలి, మరాఠీ, మలయాళం, మెయిట్య్, నేపాలీ, పంజాబీ, సంస్కృత, సంతలి, సింధీ, తమిళ్, తెలుగు, ఉర్దూ ఇలా ఇంగ్లీష్ ని కలుపుకొని 23 భాషలు, ఆ భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. మన ప్రపంచంలో 6500 భాషలు ఉన్నాయి. మాతృభాష అంటే ఏమిటి ? మాతృ అంటే అమ్మ. మాతృబాష అంటే మన అమ్మ మాట్లాడే బాష లేదా మనం మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు నేర్చుకున్న భాష అని అర్థం. మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడే భాషను గ్రహించడం మాట్లాడే ప్రయత్నం చేస్తాము. మనం అమ్మ ఒడిలో కూర్చొని చిన్న చిన్న పదాలుగా మొదలు పెట్టి వయస్సు పెరిగేకొద...
దేశ భాషలందు తెలుగు లెస్స !. తెలుగు మన జీవన వెలుగు! తెలుగు బాషా గొప్పతనం తెలుసుకుందాం ! తెలుగు భాషను కాపాడుకుంటాం .