Love Vs Attraction ఏది ప్రేమ / ఏది ఆకర్షణ ! Love / ప్రేమ అంటే ఏంటి? ప్రేమంటే రెండు మనసులు కలవడం అని చెప్పవచ్చు. ప్రేమ అంటే ఓ మధురమైన భావన. ప్రేమించడం చాలా సులభం , కానీ ప్రేమను పొందడం చాలా కష్టం, పొందినా ఆ ప్రేమను నిలుపుకోవడం ఎంతో కష్టం. ప్రేమ అనేది ఎప్పుడు పడితే అప్పుడు పుట్టదు. మనకు ఎవరిమీదిన ప్రేమ కలిగిందంటే అది చచ్చేదాకా పోదు, ఎల్లప్పుడూ వారిని వారి జ్ఞాపకాలను గుర్తుచేస్తూ ఉంటుంది . "love at first sight" అంటే చూడంగానే ప్రేమ పుట్టడం.ఇలాంటివి మనం సినిమాలలో చూస్తూ వింటూ ఉంటాం. ఎలాంటివి చెప్పడానికి, వినడానికి బాగుంటాయి కానీ నిజజీవితం లో చాలా అరుదు. చూడగమే ప్రేమ ఎలా కలుగుతుంది? అది ప్రేమా లేదా ఆకర్షణ? Attraction / ఆకర్షణ అంటే ఏంటి? ఆకర్షణ అంటే ఏదైనా ఒక దాని పట్ల ఇష్టం లేదా కోరిక ఏర్పడడం. అది ఒక వస్తువుమీదే కావచ్చు, మనిషి మీదే కావచ్చు, జంతువు మీదే కావచ్చు. ఆకర్షణ అనేది ఎవరికైనా,ఎక్కడైనా, ఎప్పుడైనా కలగవచ్చు. ఆకర్షణ అనేది ఆ ఒక వక్తికే సంబంధించి ఉంటుంది. చిన్నపిల్లలు బొమ్మలకు, పెద్దవారు సినిమాలకు, వాహనాలకు, ఇష్టమైన ప్రదేశాలకు ఆకర్షితులై ఉంటారు. ఈ ఆకర్షణకు, ప్...
దేశ భాషలందు తెలుగు లెస్స !. తెలుగు మన జీవన వెలుగు! తెలుగు బాషా గొప్పతనం తెలుసుకుందాం ! తెలుగు భాషను కాపాడుకుంటాం .