అమ్మ - నా బంగారు తల్లి
అమ్మ!
ఈ సృష్టిలో ఏ జీవనికైనా ప్రాణం పోసేది అమ్మ . సృష్టికి మూలం అమ్మ . ఆది దేవత అమ్మ. తల్లి , జనని, మాత , పృథ్వీ, మా , ఇలా చాలా పేర్ల తో అమ్మని పిలుస్తారు. అమ్మ అంటే అందం, అమ్మ అంటే ఆనందం .
- అమ్మను మించిన దైవం లేదు , అమ్మను మించిన గురువు లేదు.
- తన ప్రాణం సైతం పణంగా పెట్టి , తొమ్మిది నెలలు తన కడుపునా మోసి , ఒక జీవానికి ప్రాణం పోస్తుంది.
- తన ఒడిలోనే ఓనమాలు నేర్పేది అమ్మ .
- మన వేలు పట్టి బుడి బుడి నడకలు నేర్పేది అమ్మ .
- మనకు మాటలు నేర్పేది అమ్మ . అమ్మే మన గురువు , దైవం , మన ప్రాణం.
- అమ్మ అనే తియ్యని మాట వింటే చాలు మన మొహాన ఒక వెలుగు , తెలియని సంతోషం వస్తుంది . అది అమ్మ అనే పదానికి ఉన్న మహిమ
- ఏ స్వార్థం లేని స్వచ్ఛమైన ప్రేమ అమ్మ ప్రేమ . ఎల్లప్పుడూ మన మంచికోరేది అమ్మ .
- తన కంటికి రెప్పలా తన బిడ్డలను కాపాడుకునేది అమ్మ.
- తాను తినక బిడ్డలకు పెట్టేది అమ్మ .
- మనకు దెబ్బ తాకితే అమ్మ కండ్లలో నీళ్లు వస్తాయి .
- మనకు కష్టం వస్తే అమ్మ బాధపడుతది .
- మన సంతోసంలో, మన బాధలో అన్నింటిలో మనతో ఉండేది అమ్మ .
- అమ్మ సంతోషంగా ఉంటె కుటుంబమే సంతోషంగా ఉంటుంది .
- అమ్మ ప్రేమ వెలకట్టలేనిది . అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పిన తక్కువే .
- అమ్మ త్యాగం మారవా లేనిది .
- అమ్మ ఋణం తీరలేనిది .
- అమ్మను ప్రేమిద్దాం అమ్మ ప్రేమను గౌరవిద్దాం .
Comments
Post a Comment