Love Vs Attraction
ఏది ప్రేమ / ఏది ఆకర్షణ !
Love / ప్రేమ అంటే ఏంటి?
ప్రేమంటే రెండు మనసులు కలవడం అని చెప్పవచ్చు. ప్రేమ అంటే ఓ మధురమైన భావన. ప్రేమించడం చాలా సులభం , కానీ ప్రేమను పొందడం చాలా కష్టం, పొందినా ఆ ప్రేమను నిలుపుకోవడం ఎంతో కష్టం. ప్రేమ అనేది ఎప్పుడు పడితే అప్పుడు పుట్టదు. మనకు ఎవరిమీదిన ప్రేమ కలిగిందంటే అది చచ్చేదాకా పోదు, ఎల్లప్పుడూ వారిని వారి జ్ఞాపకాలను గుర్తుచేస్తూ ఉంటుంది . "love at first sight" అంటే చూడంగానే ప్రేమ పుట్టడం.ఇలాంటివి మనం సినిమాలలో చూస్తూ వింటూ ఉంటాం. ఎలాంటివి చెప్పడానికి, వినడానికి బాగుంటాయి కానీ నిజజీవితం లో చాలా అరుదు. చూడగమే ప్రేమ ఎలా కలుగుతుంది? అది ప్రేమా లేదా ఆకర్షణ?
Attraction / ఆకర్షణ అంటే ఏంటి?
ఆకర్షణ అంటే ఏదైనా ఒక దాని పట్ల ఇష్టం లేదా కోరిక ఏర్పడడం. అది ఒక వస్తువుమీదే కావచ్చు, మనిషి మీదే కావచ్చు, జంతువు మీదే కావచ్చు. ఆకర్షణ అనేది ఎవరికైనా,ఎక్కడైనా, ఎప్పుడైనా కలగవచ్చు. ఆకర్షణ అనేది ఆ ఒక వక్తికే సంబంధించి ఉంటుంది. చిన్నపిల్లలు బొమ్మలకు, పెద్దవారు సినిమాలకు, వాహనాలకు, ఇష్టమైన ప్రదేశాలకు ఆకర్షితులై ఉంటారు. ఈ ఆకర్షణకు, ప్రేమకు పులికి, పిల్లికి ఉన్నంత తేడా ఉంది.
స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏంటి?
what is True love?
స్వచ్ఛమైన ప్రేమ అంటే ఎప్పుడు తగ్గనిది. అంటే మనం ప్రేమించే వానితో మనకు ఎన్ని గొడవలచిన్న, ఎన్ని విభేదాలువచ్చిన, ఒక్కరిని ఒకరు అర్ధం చేసుకొని మళ్ళీ కలిసిపోవడమే అస్సలైన ప్రేమ. మనది స్వచ్ఛమైన ప్రేమైతే మనం ప్రేమించిన వారిని ఎప్పుడు దూరం చేసుకోము. స్వచ్ఛమైన ప్రేమకు కుల, మత భేదాలుండవు. అందచందాలకు ఆస్కారం ఉండదు.
మనకు కలిగేది ప్రేమా! లేదా ఆకర్షణ! అనేది ఎలా గుర్తించాలి ?
మనకు ఒక వక్తి మీద ఉంది ప్రేమా, లేదా ఆకర్షణ అని తెలుసుకోవడం చాలా సులభం. ప్రేమ అనేది మానను కొందరి మీదే కలుగుతుంది అదే ఆకర్షణ అయితే ఎవరిమీదైనా కలగవచ్చు. ఆకర్షణ అనేది చాలా కాలం ఉండదు. అదే ప్రేమ అయితే మనం చచ్చేదాక ఉంటుంది. అవతలివారు మనలని ప్రేమించిన, ప్రేమించకపోయిన వారి పట్ల మాతం మనకు ప్రేమ తగ్గదు. అదే ఆకర్షణ అయితే అవతలి వారు మనలని ఇష్టపడకపోతే మనం కూడా వదిలేస్తాం.
ఒక వ్యక్తి ప్రేమలో ఉన్నాడని ఎలా గుర్తించాలి ?
ఎవరైనా ప్రేమలో ఉంటె వారు ఎప్పుడీ ఆ వ్యక్తి గురించే ఆలోచిస్తూ వారి జ్ఞాపకాలలో మునిగిపోయి ఉంటారు. వారు ఒక వ్యక్తిని ఎప్పకడికి చూడాలని , ఆ వ్యక్తీతో మాట్లాడాలని అనుకుంటూ ఉంటారు. సమయానికి తినరు, సమయానికి పడుకోరు, ఎప్పడికీ ఆ వ్యక్తి గురించే ఆలోచిస్తారు. వారి మొహాన చిరునవ్వు ఉంటుంది. ఎవరు ఫోన్ చేసిన ఎవరు మెసేజ్ చేసిన ఆ వ్యక్తే అని అనుకుంటారు.
నా అభిప్రాయం !
చిన్న-చిన్న విషయాలకు గొడవపడి మనస్పర్థలు తెచ్చుకొని మీరు ప్రేమించిన వారిని దూరం చేసుకోకండి. చెప్పుడు మాటలు విని మీ ప్రేమను వదులుకోకండి. మీరు ఎవరినైనా ప్రేమిస్తే వెళ్లి చెప్పండి అంతే కానీ అది మీలోనే దాచుకొని పొరపాటు చెయ్యకండి.
Comments
Post a Comment