Importance of mother tongue
మాతృభాష ప్రాముఖ్యత
భాష గొప్పతనం!
ఈ భూమండలం మీద ఏ జీవికి లేని ఒక అద్భుతమైన శక్తీ మనిషికి ఉంది. అదే మాట్లాడే శక్తీ. మనం ఎవరితోఅయన మాట్లాడాలంటే ఏదైనా ఒక భాష తెలిసిఉండాలి. ఒక భాషతో మనలోని భావాలను ఇతరులకి తెలియజేయచ్చు. భాష వలన ఒకరి భావాలను ఒకరికి తెలియజేయవచ్చు. బాష మనిషిని ఒక ఉన్నతుడిగా నిలబెట్టింది. భాష లేకపోతే మనిషి మనుగడ కష్టమయ్యేది.
భారతదేశంలో అస్సామీ, బెంగాలీ, బోడో, డోగ్రి, గుజరాతీ, హింద్, కన్నడ, కాశ్మీరీ, కొంకని, మైథిలి, మరాఠీ, మలయాళం, మెయిట్య్, నేపాలీ, పంజాబీ, సంస్కృత, సంతలి, సింధీ, తమిళ్, తెలుగు, ఉర్దూ ఇలా ఇంగ్లీష్ ని కలుపుకొని 23 భాషలు, ఆ భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. మన ప్రపంచంలో 6500 భాషలు ఉన్నాయి.
మాతృభాష అంటే ఏమిటి ?
మాతృ అంటే అమ్మ. మాతృబాష అంటే మన అమ్మ మాట్లాడే బాష లేదా మనం మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు నేర్చుకున్న భాష అని అర్థం. మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడే భాషను గ్రహించడం మాట్లాడే ప్రయత్నం చేస్తాము. మనం అమ్మ ఒడిలో కూర్చొని చిన్న చిన్న పదాలుగా మొదలు పెట్టి వయస్సు పెరిగేకొద్దీ పూర్తిగా రాయడం, మాట్లాడడం నేర్చుకుంటాం. మన నోటి నుండి వచ్చే మొదటి భాషే మాతృబాష.
మాతృభాష గొప్పతనం :
మాతృబాష చాలా మహోన్నతమైనది. ప్రాచీనకాలం నుండే మాతృభాషకు పెద్దపీట వేసారు. మన మాతృబాష మనకు సులభంగా అర్ధమవుతుంది. ఏ విషయాన్నైనా మన మాతృబాషలో నేర్చుకుంటే అది చాలా కాలం గుర్తుంటుంది. మన మాతృబాషతో మన ఆలోచన శక్తి , సృజనాత్మకత పెంపొందుతాయి. మన ప్రాంతంలోని ప్రజలతో మమేకమవడానికి, మాతృబాష ఉపయోగపడుతుంది.
మాతృభాష వలన లాభాలు :
- విద్యార్థులు మాతృభాషలో నేర్చుకుంటే వారికి సులభంగా అర్ధమవుతుంది.
- విద్యార్థులలో ఆలోచన శక్తీ, చదువుకోవాలన్న ఆసక్తి పెరుగుతాయి.
- సమాజం గురించి, మన ప్రాంతం గురించి అవగాహన తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది.
- యువతలో దేశభక్తి, ప్రాంతీయభక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది.
- విద్యార్థులలో దూరద్రుష్టి, ముందుచూపు పెంచడానికి ఉపయోగపడుతుంది.
మాతృభాష ఎందుకు కాపాడుకోవాలి ?
ఈ రోజుల్లో అందరు జాతీయ బాష అయిన ఇంగ్లీష్ నేర్చుకోవడంలో చూపిస్తున్న శ్రద్ధ మాతృభాషను నేర్చుకోవడంలో చూపించడం లేదు. కొంత మందికైతే వారి మాతృభాష ఏంటో కూడా తెలియదు. మాతృభాషను నేర్చుకోకపోతే మన తల్లిని అవమానించినట్టే. మాతృభాషను మర్చిపోతే మన తల్లిని మర్చిపోయినట్టే. తల్లి ఒడిలో ఓనమాలు నేర్చుకున్న భాషను ఎలా మరుస్తారు.
మనం ఏ దేశంలో ఉన్న ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్న మన భాషను, మన ఊరిని, మన దేశాన్ని, కన్నాతల్లిని, మర్చిపోకూడదు. ఎల్లప్పుడు మాతృబాష మీద మక్కువతో ఉండాలి. ప్రభుత్వాలు కూడా తగిన ఆలోచనలు చేసి, కొన్ని గ్రంధాలయాలను ఏర్పాటుచేసి, మాతృభాషను,
సంస్కృతిని,కళలను,కవిత్వాన్ని కాపాడాలి.
నా మాతృభాష తెలుగు :
ఈ ప్రపంచంలోనే అతిమధురమైన భాష నా తెలుగు భాష. తెలుగుభాష వింటున్న, మాట్లాడుతున్న ఒక మంచి అనుభూతి వస్తుంది. శ్రీకృష్ణ దేవరాయల వంటి వాడే "దేశ భాషలందు తెలుగు లెస్సా " అని అన్నాడు. మన తెలుగే దేశానికి వెలుగు. తెలుగు భాష నేర్చుకోవడం చాలా సులభం. తెలుగు భాషలోని కథలు, కవితలు, పద్యాలూ, పాటలు, జానపదాలు, నాటకాలు, చాలా ఆకర్షితంగా ఉంటాయి. తెలుగు భాష గురించి ఎంత చెప్పిన తక్కువే.
Comments
Post a Comment