కరోనా రోజులు
చైనాలోని వుహాన్ పట్టణానపుట్టిందంట వైరస్ కరోనా
ఇది విని మొదలైంది భయం మన జనాన
పరిశోధనలకు కూడ చిక్కని వింత
మొదలైంది ధేశాలన్నింటికి చింత
ఈ వ్యాదికి లేదంట మందు
ప్రపంచ జనాభా ఎంత ఈ మహమ్మారి ముందు
దేశాలన్ని పాటించక తప్పదంట బంధు
దేశమంత ప్రకటించారు బంధు
ఈ కరోనాకి దొరికే వరకి మందు
మందులకు తగ్గేది కాదంట ఈ జబ్బు
మన దగ్గర ఎంతున్న పనికిరాదంట ఈ డబ్బు
ఒకే ప్రంతంలో ఉండనిది
సైన్సుకు కూడ చిక్కనిది
ఈ కరోనా ఎంత చక్కనిది
తనమన బేదాలు చూపదట
కులమత జాతీ,వర్గాలు లెక్కచేయదట
మనకు కరోనాకి ఉందంట ఏదో సంబంధం
అందరు పాటించక తప్పదంట గ్రుహనిర్బందం
మనిషి మనిషికి మీటరు దూరం
కాదని అంటే తప్పదు గోరం
సబ్బుతో చేతులు కడుగుదాం
పరిశుబ్రత పాటిద్దాం
చేతులు కలపడం వద్దు
మన నమస్కారమే ముద్దు
మాస్కే మన పాలిట దైవం
అది లేకుంటే మనమవుతాం శవం
తగిన జాగ్రత్తలు తీసుకుందాం
మనలను మనం కాపాడుకుందాం
పెండ్లిల్లు పెరంటాలు బంధు,
ఉండదు చుట్టాల ఇంట్లో వింధు.
కరోనాకు అండగా యమభటులు
ప్రజలకండగా రక్షకభటులు.
వైధ్యసిబ్బంది అంది మేముసైతం
లెక్కచేయట్లేదు తమ ప్రాణాలు సైతం.
కరోనాకు మనకు మద్య పోరాటం
చూస్తున్నాం నాయకుల ఆరాటం.
పారిశుద్దకార్మికులు అంటుంటే జయం
పుట్టిందంట కరోనా గుండెల్లో భయం
వారు లేకుంటే సాదించలేం విజయం.
కరోనా మన పాలిట మహమ్మారి
కాని ప్రక్రుతి పాలీట కుమారి.
తగ్గిందంట జల,వాయు కాలుష్యం
ఇక చూడమంట నాటి కాలుష్యం.
పరిమలిస్తుంది ప్రక్రుతి
రూపుదిద్దుకుంటుంది తన ఆక్రుతి.
ప్రపంచమంత కరోనా ప్రభంజనం
కరోనాకు మనకి మద్య తప్పదంట రణం
సైనికులెవరోకాదు మన జనం
ఇక ముగియనున్నది కరోనా కథనం.
మనం చేసాం చప్పట్ల ద్వని
పారిపోనున్నది కరోనా అది విని
మన ఐక్యత చాటుతు వెలిగించాం దీపం
ఆ వెలుగుతో పండిందంట కరోనా పాపం
వినవయ్యా! ఓ గొప్ప త్యాగి
ఏమీ లేనిచో వండుకొని తిను మ్యాగి
ఇంట్లో ఉంటే నువ్వో మహాయోగి
కాదని బయటకు వెలితే అవుతావు కరోనా రోగి
Comments
Post a Comment